Thursday, July 4, 2019

అదివాసీలపై దాడులను అరికట్టాలి: ఏఐకేఎంఎస్‌

అదివాసీలపై దాడులను అరికట్టాలి: ఏఐకేఎంఎస్‌
05-07-2019 03:07:09
హైదరాబాద్: ఆదివాసీలు, గిరిజనులపై దాడులను అరికట్టాలని అఖిల భారత రైతు కూలీ సంఘం(ఏఐకేఎంఎస్‌) సదస్సులో వక్తలు డిమాండ్‌ చేశారు. ఈ సదస్సులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, ఒడిసా, మహారాష్ట్ర, పంజాబ్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ రాష్ట్రాలకు చెందిన 600 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. ఏఐకేఎంఎస్‌ ఆలిండియా అధ్యక్షుడు వేములపల్లి వెంకట్రామయ్య అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్య అతిథిగా అటవీ హక్కుల కార్యకర్త, హైకోర్టు న్యాయవాది పల్లా త్రినాఽథ్‌రావు హాజరయ్యారు.

No comments:

Post a Comment